calender_icon.png 22 January, 2026 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాళ్లకు డైలాగ్ చెప్పడమే రాదు

22-01-2026 01:41:58 AM

మాళవికా మోహనన్.. ఇటీవల ప్రభాస్‌తో కలిసి ‘రాజాసాబ్’లో నటించటం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఓ తమిళ సినిమాలో భావోద్వేగాలు సరిగ్గా పండించలేకపోయిందంటూ కొంతకాలం క్రితం సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అయిందీ మలయాళ బ్యూటీ. అలాంటి మాళవిక.. ఇప్పుడు తెలుగు, తమిళ హీరోయిన్లకు అసలు డైలాగులు చెప్పడం రాదంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. బాలీవుడ్ నటులు మనోజ్ బాజ్‌పాయీ, ఇషాన్ ఖట్టర్‌తో కలిసి మాళవిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.

ఈ సందర్భంగా వాళ్లతో మాట్లాడుతూ తెలుగు హీరోయిన్లపై షాకింగ్ కామెంట్స్ చేసింది. “తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో చాలా కాలంగా కొంతమంది హీరోయిన్లు అసలు డైలాగులను చూడనే చూడరు. ఓ సీన్‌లో బాధగా కనిపించాలంటే ముఖం బాధగా పెట్టి 1, 2, 3, 4.. 1, 2, 3, 4 అనేవాళ్లు.. అంతే! ఎందుకంటే ఏదో సమయంలో డైలాగులు లిప్ మూమెంట్‌కు సరిపోయేవి. కొన్నిసార్లు ఏబీసీడీ, ఏబీసీడీ అనేవాళ్లు. ఇదేదో ఎప్పుడో ఒకసారి చేసింది కాదు. కెరీర్ మొత్తం ఇలాగే చేశారు” అని తెలిపింది. అయితే తాజాగా మాళవిక చేసిన కామెంట్స్‌పై మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు ఆమె వ్యాఖ్యలను సమర్థిస్తుంటే మరికొందరు విమర్శిస్తున్నారు. ఓ మలయాళ నటి గా తెలుగు సినిమాలో డైలాగులు నువ్వు మాత్రం సరిగ్గా చెప్పగలవా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరికొందరేమో మాళవిక చెప్పిన ఆ హీరో యిన్లు ఎవరై ఉం టారూ?! అంటూ చర్చించుకుంటున్నారు.