22-01-2026 01:38:57 AM
అడివి శేష్ ఇప్పుడు ‘డకాయిట్’ చిత్రంతో అలరించబోతున్నారు. సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ చిత్రానికి సునీల్ నారంగ్ సహ నిర్మాత. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాతో షానియల్ డియో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇందులో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తుండగా, దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఒక ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్, అతుల్ కులకర్ణి, సునీల్ కీలక పాత్ర ల్లో కనిపించనున్నారు.
ఇటీవల చిత్ర నిర్మాతలు విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన లభించింది. అయితే, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. తాజాగా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఒక భారీ షెడ్యూల్‌లో పాల్గొనడంతో మృణాల్ షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాలోని తన పాత్రకు తెలుగు, హిందీ భాషల్లో మృణాల్ స్వయంగా తానే డబ్బింగ్ చెబుతోందని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూర్చుతుండగా, జ్ఞాని నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీని ధనుష్ భాస్కర్ నిర్వర్తిస్తున్నారు. ఉగాది సందర్భంగా మార్చి 19న థియేటర్లలో విడుదల కానుందీ చిత్రం.