30 August, 2026 | 11:20 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

ఆస్ట్రియాలో కాల్పుల కలకలం

11-06-2025 12:00 AM
  1. గ్రాజ్ నగరంలోని ఓ పాఠశాలలో కాల్పులు
  2. 11 మంది మృతి.. 30 మందికి పైగా గాయాలు
  3. కాల్పులు జరిపిన విద్యార్థి టాయిలెట్‌లో ఆత్మహత్య

వియన్నా, జూన్ 10: ఆస్ట్రియాలో రెండో అతిపెద్ద నగరమైన గ్రాజ్‌లో మంగళవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రాజ్‌లోని స్థానిక బోర్గ్ డ్రెయిర్‌షుట్జెన్‌గాస్సే పాఠశాలలో ఒక విద్యార్థి జరిపిన కాల్పుల్లో 11 మం ది మరణించగా.. 30 మందికి పైగా విద్యార్థులు, టీచర్లు గాయపడ్డారు. అనంతరం కాల్పులు జరిపిన విద్యార్థి పాఠశాల టాయిలెట్‌లో తనను తాను కాల్చుకొని ఆత్యహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో గ్రాజ్ నగరం ఉలిక్కిపడింది.

స్థానిక కాలమాన ప్రకారం మంగళవారం ఉదయం 10 గంటల ప్రాం తంలో ఈ దారుణం జరిగిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. పాఠశాల ప్రారంభమైన కాసేపటికే నిందితుడు తన వెంట తెచ్చుకున్న తుపాకీతో రెండు తరగతి గదుల్లోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పుల కు తెగబడ్డాడు. అతడిని వారించడానికి ప్రయత్నించిన ఒక మహిళా టీచర్‌పై పలుమార్లు కాల్పులు జరపడంతో ఆమె తీవ్రంగా గాయపడింది.

పాఠశాల భవనం లోపలి నుంచి తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిం చారు. కాగా కాల్పులు జరిపిన విద్యార్థి మృతదేహం పాఠశాల టాయిలెట్‌లో కనిపించిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్న ట్టు తెలిపారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా భద్రతా దళాలను మోహ రించినట్టు తెలిపారు.

కాగా 2015 జూన్‌లో గ్రాజ్ ప్రాంతంలో ఇదే తరహాలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయా రు. ఈ ఘటనకు పదేళ్లు పూర్తి కావడంతో దానికి గుర్తుగా విద్యార్థి కాల్పులకు తెగబడి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. గ్రాజ్ నగరం ఆస్ట్రియాకు ఆగ్నేయ ప్రాంతంలో ఉంది. ఇక్కడ సుమారు మూడు లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు.