30 August, 2026 | 10:09 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం

11-06-2025 12:00 AM
  1. ద్వారకా సెక్టార్‌లోని అపార్ట్‌మెంట్‌లో ఘటన
  2. ఏడు, ఎనిమిది అంతస్తుల్లో చెలరేగిన మంటలు
  3. ప్రాణభయంతో కిందకు దూకిన తండ్రీ బిడ్డలు కన్నుమూత

న్యూఢిల్లీ, జూన్ 10: దేశ రాజధాని ఢిల్లీ లో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ద్వారకా సెక్టార్‌లోని శపథ్ అపార్ట్‌మెంట్‌లోని ఏడు, ఎనిమిది అంతస్తుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగా యి. అయితే తొమ్మిదో అంతస్తులో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన తండ్రీ, బిడ్డలు ప్రాణభయంతో కిందకు దూకడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ ఘటనలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఫ్లెక్సీ బోర్డ్ వ్యాపారం చేస్తోన్న యశ్ యాదవ్ తన భార్య, ముగ్గురు పిల్లలతో శపథ్ సొసైటీలో నివసిస్తున్నారు.  ఈ క్రమంలో వారు నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌లో మంగళవారం ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. ఏడు, ఎనిమిది అంతస్థులకు మంటలు అంటుకోవడం తో భయభ్రాంతులకు గురయ్యారు. ప్రాణా లు కాపాడుకునేందుకు తండ్రి, ఇద్దరు పిల్ల లు తొమ్మిదో అంతస్తు నుంచి కిందకు దూకడంతో తీవ్ర గాయాలయ్యాయి.

వారిని ఆసు పత్రికి తరలించే లోపే ప్రాణాలు విడిచారు. అయితే మంటల్లో చిక్కుకున్న యశ్ భార్య, పెద్ద కుమారుడికి గాయాలయ్యాయి. ప్రస్తు తం ఈ ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అపార్ట్‌మెంట్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన అధికారులు అక్కడ నివసిస్తున్న వారిని వేరే ప్రాంతానికి తరలించారు.

ఎనిమిది ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. తొలుత మరికొందరు చిక్కుకున్నట్లు వార్తలు రావడంతో వారిని రక్షించేందుకు అ గ్నిమాపక విభాగం స్కైలిఫ్ట్‌ను మోహరించి ంది. భారీగా పొగ వెలువడడంతో  సహయక చర్యలకు ఆటంకం కలిగింది.