13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

ఆస్తి పన్ను చెల్లించని దుకాణాలు సీజ్..

23-03-2026 11:41 AM

మొండి బకాయిలు చెల్లించకుంటే ఆస్తులు జప్తు చేస్తాం

మున్సిపల్ కమిషనర్ హెచ్చరిక 

తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పరిధిలో(Tandur Municipal Limits) ఏండ్ల తరబడి ఆస్తిపన్ను చెల్లించని దుకాణాలను మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది తాళాలు వేశారు. శ్రీ పోట్లీ మహారాజ్ దేవాలయం ప్రాంగణంలో ఉన్న దుకాణ సముదాయం నిర్వాహకులు ఆస్తిపన్ను చెల్లించకపోవడంతో సోమవారం తాళాలు వేసి సీజ్ చేశారు.

ఈ సందర్భంగా కమిషనర్ మధుసూదన్ రెడ్డి(Commissioner Madhusudan Reddy) మాట్లాడుతూ ఆస్తి పన్ను మొండి బకాయిదారులకు రెడ్ నోటీసులు జారీ చేశామని అయినా కూడా స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో చర్యలు తీసుకున్నామని అన్నారు. ప్రైవేటు ప్రాపర్టీలకు సంబంధించి మొండి బకాయి ఉన్నవారికి రెడ్ నోటీసులు అందిస్తూ కట్టకపోతే ఇకముందు ఆస్తులు జప్తు చేసుకుంటామని హెచ్చరించారు. పన్నులు చెల్లించకపోతే పట్టణానికి రావలసిన గ్రాండ్స్ గ నిలిచిపోయే అవకాశం ఉందని వివరించారు. పట్టణ ప్రజలు టాక్స్ లు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. కమిషనర్ వెంట మేనేజర్ నరేందర్ రెడ్డి, సిబ్బంది రాములు,  నాగేందర్, కపిల్, గోపాల్,  ఉమేష్,జవాన్లుతదితరులు ఉన్నారు.