calender_icon.png 25 October, 2025 | 1:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ఐక్యరాజ్యసమితి ఆవిర్భావ దినోత్సవం

25-10-2025 12:00:00 AM

కల్వకుర్తి టౌన్ అక్టోబర్ 24 : పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శర్వాణి ఆధ్వర్యంలో యూఎన్‌ఓ ఆవిర్భావ దినోత్సవాన్ని విద్యార్థులతో కలిసి ఘనంగ జరుపుకున్నారు. 2025లో శాంతి, ఐక్యత, ప్రపంచ భాగ్యస్వామ్యం లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. మా నవ హక్కులు అభివృద్ధిని ప్రోత్సహించడం లో ముఖ్య పాత్ర ఎంతైనా ఉందని విద్యార్థులకు తెలిపారు. ప్రపంచంలో దేశాల మధ్య యుద్దాలు జరగకుండా యుఎన్‌ఓ కృషి చేస్తుందన్నారు. వైస్ ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, అకాడమీ కోఆర్డినేటర్ రాజు, జగదీశ్వర్ రెడ్డి, అధ్యాపకులు అధ్యాపకేతర బృందం విద్యార్థులు తదితరులుపాల్గొన్నారు.