calender_icon.png 10 July, 2025 | 10:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పనిచేసి కూడా పస్తులుండాలా?

10-07-2025 12:09:53 AM

  1. కనీస వేతనం అమలు చేసిన కష్టమే 

లేబర్ కోడ్లుకు వ్యతిరేకంగా కార్మిక వర్గం నిరసన 

మహబూబ్ నగర్ జూలై 9 (విజయ క్రాంతి) : ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థల్లో పనులు చేసి దేశ అభివృద్ధికి పాటుపడుతూ వేతనం ఇవ్వకుంటే పస్తులుండి జీవనం సాగించాలా అం టూ కార్మిక వర్గం జిల్లా కేంద్రంలో బుధవారం భారీ ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు.

కార్మికులు, రైతులు వ్యవసాయ కూలీలు, కాంట్రాక్ట్ ,ఔట్సోర్సింగ్ కార్మికులు గ్రామపంచాయతీ, మునిసిపల్, అమాలీలు ,భవన నిర్మాణ కార్మికులు, అంగన్వాడీ ,ఆశ మధ్యాహ్నం భోజనము, ఫీల్ అసిస్టెంట్లు, బ్యాంకు ఉద్యోగులు ,మెడికల్ రిప్స్, పెయింటర్సు, ప్లంబర్సు ,టైల్స్ వర్కర్స్ ,ఫంక్షన్ హాల్ వర్కర్స్ రైస్ మిల్ వర్కర్స్, కేజీబీవీ వర్కర్లు ,రిటైర్డ్ పెన్షనర్స్ తదితరులు లేబర్ కొడ్లకు వ్యతిరేకంగా కదం తొక్కారు .

రేషన్ షాపుల్లో 14 రకాల నిత్యావసర సరుకులు ఇవ్వాలని, బ్రిటిష్ వాడి కాలంలో వచ్చిన 29 కార్మిక చట్టాలను కార్మికుల అనుకూలమైన వాటిని రద్దుచేసి కార్పొరేట్లకు పెట్టుబడిదారులకు ఊడిగం చేసే రకంగా చట్టాలను మార్చి లేబర్ కోట్లుగా తేవడానికి తీవ్రంగా ఖండించారు ఉపసంహరించుకోకపోతే దేశవ్యాప్త మరో స్వాతంత్ర ఉద్యమానికి కార్మిక వర్గం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి న ల్లవెల్లి కురుమూర్తి, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు రాములుయాదవ్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పి సురేష్, టి యు సి ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు సి వెంకటేష్ ,టి ఎన్ టి యు సి జిల్లా నాయ కులు డి రాములు, టియుసిఐ జిల్లా కార్యదర్శి సాంబశివుడు, తదితరులు ఉన్నారు.