calender_icon.png 10 July, 2025 | 3:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీసీ రోడ్డు పనులను పరిశీలించిన పీఏసీ చైర్మన్,ఎమ్మెల్యే గాంధీ

10-07-2025 12:08:35 AM

శేరిలింగంపల్లి, జూలై 9: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని హెచ్‌ఏఎల్ కాలనీ లో రూ.4 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్ల నిర్మాణం పనులను బుధవారం పీఏసీ చైర్మన్,ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ జిహెచ్‌ఎంసి అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రతి కాలనీలో సీసీ రోడ్డ్ల ని ర్మాణం చేపడుతున్నామని అన్నారు.

ప్రజల సంక్షేమం, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాలనీల అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తున్నామని అన్నారు. శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన ,అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదితానని అన్నారు.సీసీ రోడ్డు పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని అధికారులను ఎమ్మెల్యే గాంధీ సూచించా రు.ఈ కార్యక్రమంలో జిహెచ్‌ఎంసి ఇంజనీరింగ్ విభాగం అధికారులు డీఈ ఆనంద్, ఏఈ భా స్కర్ నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, దాత్రి గౌడ్, హరికృష్ణ మరియు కాలనీ వాసులు తదితరులుపాల్గొన్నారు.