calender_icon.png 10 July, 2025 | 9:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాచలం ఈవోపై దాడి ఘటన దారుణం

10-07-2025 12:10:36 AM

  1. దాడికి పాల్పడిన వారిని శిక్షించాలి
  2. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు

హైదరాబాద్, జూలై 9 (విజయక్రాంతి): భద్రాచలం ఈవోపై దాడి చేయడం అత్యంత దారుణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు పేర్కొన్నారు. ఇతర మతస్తులు ఆలయ భూములను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. భద్రాచలం రాముల వారి భూములు, ఖమ్మంలో టీటీడీ భూముల్లో కొందరు మసీదులు, చర్చ్‌లు నిర్మించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు.

ఈ ఆక్రమణలను ఆపేందుకు ప్రయత్నించిన భద్రాచలం మహిళా ఈవోపై దాడి చేశారని తెలిపారు. వెంటనే ప్రభుత్వం నిందితులను కఠినంగా శిక్షించాలని, దేవాలయ భూములను రక్షించాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మెదక్ ఎంపీ రఘునందన్ ఆధ్వర్యంలో గజ్వే ల్ మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్, సహా పలువురు మాజీ కౌన్సిలర్లు, పద్మశాలి సంఘం అధ్యక్షులు ఆరెపు బాలచంద్రన్ తదితరులు బీజేపీలో చేరారు.

ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ.. ఖమ్మం లో కొన్ని రాజకీయ పార్టీల ప్రోత్సాహంతో టీటీడీకి చెందిన భూముల్లో గోడలు కూలగొట్టి ఇతర మతస్తులు మసీదులు, ఇతర కట్టడాలు నిర్మించారని... టీటీడీ అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించకుండా అడ్డుకున్నారని తెలిపారు.

బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాటకాలు: ఎంపీ రఘునందన్ రావు 

నేను కొట్టినట్టు చేస్తా... నువ్వు ఏడ్చినట్లు చెయ్ అనేలా బీఆర్‌ఎస్ పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపిం చారు. సవాళ్లు, ప్రతిసవాళ్ల పంచాయతీ రాజకీయ నాటకంలో భాగమేనన్నారు. రాష్ట్ర ప్రజలు ఇది అర్థం చేసుకోవాలని కోరారు.

గజ్వేల్, సిద్దిపేట లాంటి బీఆర్‌ఎస్ తమ పెట్టని కోటలుగా చెప్పుకునే నియోజకవ ర్గాలున్న మెదక్‌లో తన గెలుపు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాటకానికి ఫుల్‌స్టాప్ పెట్టినట్లుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నేపథ్యంలోబీజేపీని ఇబ్బందిపెట్టేలా బీఆర్‌ఎస్ పార్టీలు కుట్రలు చేస్తున్నాయన్నారు. 

అధికారం కోసం దివ్యాంగులనూ వదల్లేదు 

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అలవికాని హామీలు ఇచ్చిందని, చివరకు దివ్యాంగులను కూడా రేవంత్‌రెడ్డి అండ్ కో వదిలిపెట్టలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు విమర్శించారు. దివ్యాంగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందేనని బుధవారం సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశా రు. దివ్యాంగుల సంక్షేమం, అభివృద్ధి కోసం 2023 అసె బ్లీ ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన కాంగ్రెస్ మేనిఫెస్టోలోని హామీలన్నింటినీ అమలు చేయాలన్నారు.