18 April, 2026 | 10:09 AM

ఉగ్రదాడి నేపథ్యంలో షో రద్దు

27-04-2025 12:00 AM

హల్గాం ప్రాంతంలో ఉగ్రదాడి అనంతరం దేశంలో పరిస్థితులు ఉత్కంఠగా మారిన విషయం తెలిసిందే. పలు నగరాల్లో ఇప్పటికే భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే దేశవ్యాప్తంగా ప్రస్తుతం హై అలర్ట్ ఉండడంతో పలువురు సినీప్రముఖులు తమ షోలను రద్దు చేసుకుంటున్నారు. ఇప్పటికే సింగర్ అర్జిత్ సింగ్ ఏప్రిల్ 27న చెన్నైలో జరగాల్సిన షో రద్దు చేసుకోగా.. తాజాగా సింగర్ శ్రేయాఘోషల్ కూడా తన కన్సర్ట్‌ను రద్దుచేసుకున్నారు. ఆమె శనివారం గుజరాత్‌లోని సూరత్ వేదికగా మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తు న్నట్టు ప్రకటించారు శ్రేయా. ఇప్పటికే షో కోసం టికెట్లు బుక్ చేసుకున్నవారికి డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని వెల్లడించారు.

‘ఆల్ హార్ట్స్ టూర్’ పేరుతో దేశ విదేశాల్లో సంగీత ప్రదర్శనలు ఇస్తున్న శ్రేయాఘోషల్.. చెన్నై, కోయంబత్తూరులో ఇప్పటికే ప్రదర్శనలు పూర్తిచేశారు. తాజాగా సూరత్‌లో జరగాల్సిన కార్యక్రమం రద్దయింది. మళ్లీ ముంబైలో మే 10న ఆమె షో ఉంటుంది. మరోవైపు, అనిరుధ్ కూడా ‘హుకుమ్’ పేరుతో ప్రపంచ టూర్ చేపట్టారు. మే 31న బెంగళూరులో జరగనున్న ఆయన కాన్సర్ట్ టికెట్లు గంటలోనే అమ్ముడయ్యాయి. ప్రేక్షకుల ఆదరణతో జూన్ 1న కూడా కార్యక్రమం ఉంటుందని తెలిపారు. అయితే, ఉగ్రదాడి కారణంగా రెండో రోజు టికెట్ల అమ్మకాలు వాయిదా పడ్డాయి. కొత్త తేదీని త్వరలో ప్రకటించనున్నారు.