27-04-2025 12:00:00 AM
ఈశ్వర్, నైనా సర్వర్ జంటగా యోగాలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై అనీల్‌కుమార్ కాట్రగడ్డ, ఎన్ శ్రీనివాసరావు నిర్మాణంలో, రాజేశ్ నాదెండ్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సూర్యాపేట్ జంక్షన్’. ఈ మూవీ ఈ నెల 25న థియేటర్లలో విడుదలై ప్రస్తుతం సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో ఈశ్వర్ మాట్లాడు తూ.. “సూర్యాపేట్ జంక్షన్’పై మీరు చూపించిన ప్రేమ, ఆదరణ మా హృదయాలను హత్తుకుంది. ప్రేక్షకుల స్పందన చూస్తుంటే సంతోషంగా ఉంది. పూర్తిగా పాజిటివ్ టాక్ ఉంది. మౌత్ టాక్ కూడా ప్రేక్షకులను థియేటర్‌కు వెళ్లేలా చేస్తుంది” అన్నారు.
హీరోయిన్ నైనా సర్వర్ మాట్లాడుతూ.. ‘ప్రేక్షకులు మా సినిమాను ఇంతగా ఆదరించడంతో మాకెంతో ప్రోత్సాహంగా ఉంది’ అని చెప్పారు. దర్శకుడు రాజేశ్ నాదెండ్ల మాట్లాడుతూ.. ‘మా సినిమా ద్వారా చెప్పాలనుకున్న సందేశాన్ని ప్రేక్షకులు అందరికీ చేరుతుండటం చాలా ఆనందంగా ఉంది’ అన్నారు. నిర్మాతలు అనీల్‌కుమార్ కాట్రగడ్డ, ఎన్ శ్రీనివాసరావు, మిగతా చిత్ర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.