calender_icon.png 8 August, 2025 | 1:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెకానిక్ రాకీలో శ్రద్ధా శ్రీనాథ్

22-07-2024 02:32:33 AM

యువ కథానాయకుడు విశ్వక్ సేన్ ప్రస్తుతం ‘మెకానిక్ రాకీ’గా ముస్తాబవుతున్నాడు. దీపావళి రేసులో ఈ సినిమా నిలువనున్నట్టు ఇటీవల చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా శ్రద్ధా శ్రీనాథ్ నటించనున్నట్టు మేకర్స్ తాజాగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె పాత్రకి సంబంధించిన ఓ పోస్టర్‌ను విడుదల చేస్తూ శ్రద్ధాని స్వాగతించారు ‘మెకానిక్ రాకీ’ టీమ్. ‘జెర్సీ’, ‘కృష్ణ అండ్ హిజ్ లీల’, ‘సైంధవ్’ చిత్రాలతో తెలుగు వారికి చేరువైన శ్రద్ధా, ఈసారి విశ్వక్‌తో కలిసి తెరపై సందడి చేయనున్నారు. రామ్ తాళ్లూరి నిర్మాణంలో యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా అక్టోబర్ 31 విడుదల కానుంది. నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి  రచన, దర్శకత్వంలో రానున్న ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తుండగా, మనోజ్ కటసాని ఛాయాగ్రాహకుడిగా పనిచేస్తున్నారు.