ఆర్టీసీ వారి పుణ్య క్షేత్రాలకు దర్శనం టూర్
కొత్తపల్లి,(విజయక్రాంతి): శ్రావణ మాసం సందర్భంగా కరీంనగర్ 1వ డిపో వారు సూపర్ లగ్జరీ బస్సులో ఒక్క రోజు పుణ్య క్షేత్రాల దర్శనం టూర్ ఆగష్టు 3వ తేదీ కరీంనగర్ బస్టాండ్ నుండి ఉదయం 4.00 గంటలకు బయలుదేరీ ఏడు పాయలు, యాదగిరి గుట్ట, స్వర్ణగిరి, దర్శనల అనంతరం రాత్రికి కరీంనగర్ చేరుతుంది. బస్సు చార్జీలు పెద్దలకు రూ.1000గా నిర్ణయించబడినది. మరిన్ని వివరాల కొరకు 99592 25920, 80746 90491, 73828 49352 నంబర్లను సంప్రదించలని కరీంనగర్ ఒకటవ డిపో మేనేజర్ విజయ మాధురిని సంప్రదరించగలరు.
అదేవిధంగా కరీంనగర్ రెండవ డిపో సూపర్ లగ్జరీ బస్సులో ఒక్క రోజు పుణ్య క్షేత్రాల దర్శనం టూర్ ఆగష్టు 3వ తేదీ కరీంనగర్ బస్టాండ్ నుండి ఉదయం 4 గంటలకు బయలుదేరి రామప్ప, లక్నవరం, బొగత వాటర్ ఫాల్, మల్లూరు మల్లూరు లక్ష్మినరసింహ స్వామి దర్శనం అనంతరం రాత్రికి కరీంనగర్ చేరుతుంది. ఆన్ లైన్ చేసుకోవాలనుకునే వారు సర్వీస్ నెo.88260తో చేయించుకోగలరు. బస్సు చార్జీలు రూ.1000గా నిర్ణహించారు. మరిన్ని వివరాలకు 9398658062, 7382850708, 8978383084 నంబర్లకు సంప్రదించగలరని కరీంనగర్ రెండవ డిపో మేనేజర్ ఎమ్. శ్రీనివాస్ తెలియజేసారు.






