28 June, 2026 | 7:49 AM

ఊషు క్రీడల్లో బంగారు పతకాన్ని సాధించిన షేక్ తహనీయత్ అతియా

31-07-2025 08:40 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): సంగారెడ్డిలో ఇటీవల నిర్వహించిన ఖేలో ఇండియా బాలికల ఛాంపియన్షిప్ క్రీడల్లో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థిని షేక్ తహనీయత్ అతియా జూనియర్ ఊషూ క్రీడా పోటీలో బంగారు పతకం సాధించినట్లు ప్రిన్సిపల్ పొక్కుల సదానందం తెలిపారు. ఈ మేరకు గురువారం కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో బంగారు పతక విజేత తహనీయత అతియాను ఘనంగా సన్మానించారు. బాలికలు మార్షల్ ఆర్ట్స్ లో రాణించాలని, అతియా ఆధ్వర్యంలో కళాశాలలో ప్రత్యేక మార్షల్ ఆర్ట్స్ తరగతులు నిర్వహిస్తామని ప్రిన్సిపల్ తెలిపారు.