calender_icon.png 1 August, 2025 | 5:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాతవాహనలో బాలుర హాస్టల్ వార్డెన్ గా డా.కిరణ్ నియామకం

31-07-2025 08:50:20 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): శాతవాహన విశ్వవిద్యాలయ బాలుర వసతి గృహ వార్డెనుగా వృక్షశాస్త్ర విభాగ అధిపతి సహాయ ఆచార్యులు డాక్టర్ సాయిని కిరణ్ నియమితులయ్యారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్ ఆదేశాలతో రిజిస్ట్రార్ ఆచార్య జాస్తి రవి కుమార్ నియామక పత్రాన్ని అందచేసారు. ఈ సందర్బంగా పరీక్షల నియంత్రణ అధికారి డా.సురేష్ కుమార్, ఓఎస్డి టు విసి డా.హరికాంత్, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ డా.జయంతి, అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు డా.కిరణ్ ను అభినందనలు తెలియజేసారు.