20-12-2025 01:21:56 AM
భద్రాచలం, డిసెంబర్ 19, (విజయ క్రాంతి)ఐటీడీఏ ప్రాంగణంలోని ట్రైబల్ మ్యూజియం ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా లోని బ్యాట్మెంటన్ క్రీడాకారులతో అవుట్ డోర్ బ్యాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ శుక్రవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ టోర్నమెంట్లను ఈనెల 23, 24వ తేదీలలో రాత్రి 7 గంటలకు ఐటీడీఏ ట్రైబల్ మ్యూజియం నందు ప్రారంభించి, నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు.
ఈ క్రీడలలో పాల్గొనే బ్యాట్మెంటన్ క్రీడాకారులు ఎంట్రీ ఫీజు 500 రూపాయలు చెల్లించాలని, ఎంట్రీ ఫీజు కట్టిన వారు తమ పేరుతో పాటు, తమతో పాల్గొనే పార్ట్నర్ పేరు తెలిపి, ముందు తెలిపిన పార్ట్నర్ తో మాత్రమే ఈ క్రీడలలో పాల్గొనాలని ఆయన అన్నారు. బ్యాట్మెంటన్ క్రీడలలో పాల్గొని గెలుపొందిన క్రీడాకారులకు మొదటి బహుమతి 8,000 రూపాయలు, రెండవ బహుమతి 6,000 రూపాయలు, మూడవ బహుమతి 4,000 రూపాయలు, చతుర్ధ బహుమతి 2,000 రూపాయలు అందించడం జరుగుతుందని ఆయన అన్నారు.
ఈ బ్యాట్మెంటన్ క్రీడలు అవుట్డోర్ క్రీడాకారులు మాత్రమే పాల్గొనాలని, ఇండోర్ క్రీడ కారులకు పాల్గొనే అవకాశం లేదని ఆయన అన్నారు. ఆసక్తిగల బ్యాట్మెంటన్ క్రీడాకారులు తమ ఎంట్రీ ఫీజు ఈనెల 22వ తేదీ రాత్రి 10 గంటల వరకు 9948839775, 9 6 7 6 3 9 10 61 ఫోన్ నెంబర్లకు ఫోన్ పే ద్వారా 500 రూపాయలు చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన తెలుపుతూ, ఇతర వివరములకు పై నంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవాలని ఆయన కోరారు.