calender_icon.png 20 December, 2025 | 2:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల విశ్వాసమే పార్టీ బలం

20-12-2025 01:20:45 AM

మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

అభివృద్ధి, సంక్షేమానికి జై కొట్టిన తీర్పు  సర్పంచ్లకు రఫీయొద్దీన్ శుభాకాంక్షలు

ఎల్లారెడ్డి, డిసెంబర్ 19 (విజయ క్రాంతి): ఎల్లారెడ్డి నియోజకవర్గ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘనవిజయం ప్రజల నమ్మకం, ఆశల ప్రతిబింబం అని టి.పి.సి.సి మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఫీయొద్దీన్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ నాయకత్వం లో కాంగ్రెస్ పార్టీ 46 ఏకగ్రీవాలు సాధించి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవడం, అలాగే మొత్తం 209 స్థానాలకు పోటీ చేసి 180 స్థానాలు కైవసం చేసుకోవడం ప్రజలు కాంగ్రెస్పు ఉంచిన విశ్వాసానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

ప్రజలు అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయానికి మద్దతు తెలిపే తీర్పు ఇచ్చారని, ఈ విజయంతో కాంగ్రెస్ నాయకత్వం మీద ఉన్న బాధ్యత మరింత పెరిగిందని రఫీయొద్దీన్ అన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం ఎన్నికైన సర్పంచ్లు తమ గ్రామాల్లో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను బలోపేతం చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో అహర్నిశలు కష్టపడి విజయకేతనానికి సిద్ధం చేసిన నాయకులు, కార్యకర్తలు మరియు కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల విశ్వాసమే కాంగ్రెస్ పార్టీకి అసలైన బలం అని, గ్రామ స్థాయిలో వచ్చిన ఈ మద్దతు భవిష్యత్తులో ప్రజాసేవకు మరింత ప్రేరణగా నిలుస్తుందని రఫీయొద్దీన్ స్పష్టంచేశారు.