25 March, 2026 | 4:36 PM

పోగొట్టుకున్న ఫోన్లని బాధితులకి అప్పగించిన ఎస్సై

25-03-2026 03:20 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ స్టేషన్  పరిధిలోని  గర్రెపల్లి గ్రామానికి చెందిన దీకొండ  తిరుపతి, సుద్దాల గ్రామానికి చెందిన కాలువల నరేష్, భూపతి పూర్ గ్రామానికి చెందిన ఆత్రం ప్రకాశ్ అనే వ్యక్తులు ఫోన్లు పోగొట్టుకోవడంతో సుల్తానాబాద్ పోలీసు వారికి కంప్లైంట్ చేయగా  పోలీసు వారు సిఈఐఆర్ పోర్టల్ లో వివరాలు నమోదు చేసి ఫోన్లని గుర్తించి బుధవారం సుల్తానాబాద్ ఎస్సై చంద్రకుమార్ బాధితులకు ఫోన్లను అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ... ఎవరైనా వారి సెల్ ఫోన్ ను పోగొట్టుకున్నా, దొంగతనానికి గురైనా అట్టి ఫోన్ వివరాలు సి ఈ ఐ ఆర్  పోర్టల్ లో నమోదు చేసుకోగలరని, ఈ పోర్టల్ ద్వారా మొబైల్ తిరిగి పొందే అవకాశం ఉందని ఇట్టి అవకాశమని ప్రజలు అందరు సద్వినియోగం చేసుకోగలరని సూచించారు. అదేవిధంగా ఎవరికైనా మొబైల్ ఫోన్స్,అనుమానిత వస్తువులు,  లేదా ఇతర విలువైన వస్తువులు గాని దొరికినట్లైతే వాటిని సమీప పోలీస్ స్టేషన్లో అప్పగించాలని ఎస్సై చంద్రకుమార్ తెలిపారు.