calender_icon.png 17 May, 2025 | 3:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బైండోవర్ నిబంధనలు అతిక్రమించిన యువకుడు

16-05-2025 08:05:55 PM

తహసిల్దార్ ముందు హాజరు

మందమర్రి,(విజయక్రాంతి):  పట్టణంలోని రామన్ కాలనీకి చెందిన పాత నేరస్తుడు ధనుకుంట్ల మునియప్ప బైండోవర్ నిబంధనలు అతిక్రమించడంతో తహశీల్దార్ ఎదుట హాజరు పరిచినట్లు పట్టణ ఎస్సై రాజశేఖర్ తెలిపారు. పాత నేరస్తుడు నిబంధనలు అతిక్రమించడంతో శుక్రవారం అదుపులోకి తీసుకొని నోటీసులు అందచేశారు. ఈ సందర్బంగా ఎస్సై మాట్లాడుతూ... పాత నేరస్తుడు సత్ప్రవర్తనతో నడుచుకుంటానని చెప్పడంతో గతంలో మండల తహసిల్దార్ ముందు బైండ్ ఓవర్ చేయడం జరిగిందని, అయినప్పటికి సదరు యువకుడు మళ్లీ నేరాలకు పాల్పడడంతో  బైండోవర్ నిబంధనలు అతిక్రమించినందుకు గాను అదుపులోకి తీసుకుని తహసిల్దార్ హాజరు పరిచి నోటీసులు జారీ చేయడం జరిగిందని, నోటీసు ప్రకారం ఆ యువకుడు వారం రోజుల లోపు బైండోవర్  షరతుల ప్రకారం 2 లక్షల రూపాయల జరిమానా చెల్లించాలని, లేనిపక్షంలో ఆరు నెలల జైలు శిక్ష విధించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.