కలెక్టర్ కార్యాలయం ముట్టడి
19-05-2026 12:00 AM
నిర్మల్, మే 18 (విజయక్రాంతి) : నిర్మల్ జిల్లా లక్ష్మణ చందా మండలం పీచర గ్రామంలో మత్స్యకారుల సొసైటీలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని మచ్చ కార్మికులు సోమవారం కలెక్టర్ కార్యాలయం ముట్టడించారు. గ్రామానికి చెందిన సుమారు 300 మంది కలెక్టర్ కార్యాలయం చేరుకుని తమకు జీవనోపాధి కల్పించే మత్స్య సంపదను కొందరు కోళ్లు కొట్టు విధంగా ఇతర సొసైటీలకు అప్పగించి నష్టం చేస్తున్నారని ఆరోపించారు.
తమకు తెలియకుండా ఇతర సొసైటీలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ ప్రధాన కార్యాలయం గెట్ ముందు బైఠాయించి కలెక్టర్ ను కలిసేందుకు ఒక్కసారిగా లోనికి వెళ్లడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనంతరం కలెక్టర్ ను కలిసి సమస్యను వేధించినట్టు సంఘం నాయకులు తెలిపారు






