27 May, 2026 | 8:23 PM

Breaking News

మంత్రులు పొన్నం, అజారుద్దీన్ ముందే కొట్టుకున్న ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్   •   ప్రొఫెసర్ నాగేశ్వరరావు అక్రమ అరెస్టును ఖండించిన ప్రజా సంఘాలు   •   రంగంపేటలో ధాన్యం లారీల కోసం రోడ్డు ఎక్కిన రైతన్న   •   కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేసి టెండర్ వేయాలని ఉదృతమవుతున్న పోరాటం   •   బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఇండ్లు కడితేనే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా   •   ప్రభుత్వ సంక్షేమ పథకాలు రైతాంగానికి చేరే విధంగా చూడాలి   •   విద్యుత్ షాక్ తగిలి ఐదు బర్రెలు మృతి   •   బక్రీద్ ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు   •   ఉట్నూర్ ఆర్డీవ గా బాధ్యతలు చేపట్టిన మోహన్ సింగ్   •   NEET 2026 Paper leak caseలో సీబీఐ దూకుడు.. 13కి చేరిన అరెస్టుల సంఖ్య   •  

బాలల హక్కుల పరిరక్షణకై సంతకాల సేకరణ కార్యక్రమం

08-11-2024 04:01 PM

వనపర్తి (విజయక్రాంతి): బాలల హక్కుల వారోత్సవాలలో భాగంగా ఈరోజు జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయంలో బాలల హక్కుల పరిరక్షణకై సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మొదటగా జిల్లా కలెక్టర్ బీ.ఎం.సంతోష్, ఐఏఎస్ సంతకం చేసి బాలలకు చదువుకునేందుకు స్వేచ్ఛాయుతమైన వాతావరణం కల్పించడం సామాజిక బాధ్యత అని అన్నారు. అదేవిధంగా బాలల హక్కుల పరిరక్షణ కోసం సమాజంలో ఉండే ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ రావు, జెడ్పీ సీఈవో కాంతమ్మ, జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, సిడ్యాబ్లూసి మెంబెర్ జయభారతి, లేబర్ ఆఫీసర్ మహేష్, బీసీ ఎస్సీ వెల్ఫేర్ అధికారులు రమేష్ బాబు, సరోజ, ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ ప్రియాంక, స్పోర్ట్ ఆఫీసర్ ఆనంద్, డీసీపీఓ నరసింహ, సీడీపీఓలు హేమలత, సుజాత తదితరులు పాల్గొన్నారు.