నిర్మల్‌లో ఆర్టీసీ కార్మికుల మౌన ర్యాలీ
24-04-2026 06:11 PM
నిర్మల్,(విజయక్రాంతి): ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో కార్మికులు మౌన ర్యాలీ నిర్వహించారు. బస్ డిపో నుంచి ఎన్టీఆర్ ట్యాంక్ బండ్ వరకు మూతికి నల్ల గుడ్డలు కట్టుకుని నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆత్మబలిదానం చేసుకున్న ఆర్టీసీ కార్మికులకు నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు పాల్గొన్నారు.






