1 August, 2026 | 3:51 AM

లవ్‌ప్రీత్ సింగ్‌కు రజతం

01-08-2026 02:09 AM

వెయిట్ లిఫ్టింగ్‌లో 8 పతకాలు

గ్లాస్గో, జూలై 31: కామన్వెల్త్ గేమ్స్‌లో వెయిట్ లిఫ్టింగ్ పోటీలను భారత్ ఎనిమిది పతకాలతో విజయవంతంగా ముగించింది. గ్లాస్గో వేదికగా జరిగిన ఈ పోటీల్లో భారత్ ఒక స్వర్ణం, ఆరు రజతాలు, ఒక కాంస్యాన్ని కైవసం చేసుకుంది. పురుషుల 110+ కిలోల విభాగంలో లవ్‌ప్రీత్ సింగ్ రజత పతకం సాధించాడు.

లవ్‌ప్రీత్ స్నాచ్‌లో 176 కిలోలు ఎత్తి కామన్వెల్త్ గేమ్స్ రికార్డును సమం చేశా డు. క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో 212కి లోలు లిఫ్ట్ చేసి మొత్తంగా 388 కిలోలు ఎ త్తాడు. అయితే న్యూజిలాండ్‌కు చెందిన డేవి డ్ ఆండ్రూ లిటి చివరి ప్రయత్నంలో 223 కిలోలు ఎత్తి మొత్తం 389 కిలోలతో స్వర్ణా న్ని కైవసం చేసుకున్నాడు. దీంతో లవ్‌ప్రీత్ ఒక్క కిలో తేడాతో రజతంతో సరిపెట్టుకున్నాడు.