సీమాకు కాంస్యం
గ్లాస్గో, జూలై 31: కామన్‌వెల్త్ గేమ్స్ 2026లో మహిళల డిస్కస్ త్రో విభాగంలో సీమా కళిరామన్ కాంస్య పతకం గెలుచుకుంది. ఫైనల్ మూడో రౌండ్‌లో 58.65 మీ టర్లు విసిరిన సీమా.. ఆ తర్వాత వరుసగా మూడుసార్లు ఫౌల్ అయింది. అయినా ఆమెకు కాంస్య పతకం దక్కింది. 2025 జాతీ య క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన సీమా.. ఇప్పుడు కామన్‌వెల్త్ వేదికపై కూడా పతకంతో మెరిసింది.
ఫైనల్లో తొలి ప్రయత్నంలోనే ఫౌల్ చేసిన ఆమె, రెండో ప్రయత్నంలో 57. 32 మీటర్లు, మూడో ప్రయత్నంలో 58.65 మీటర్లు విసిరింది. అనంతరం వరుసగా మూడు ఫౌల్స్ చేసినా, ప్రత్యర్థి కామెరూన్‌కు చెందిన మోనీ నోరా అతిమ్ ఆ మార్కును అధిగమించలేకపోవడంతో సీమ కాంస్యాన్ని ఖాయం చేసుకుంది. కాగా కామన్ వెల్త్ గే మ్స్‌లో పతకం కోసం తీవ్ర కసరత్తు చేసింది. కుమారుడు రుద్రకు జన్మనిచ్చిన 11 నెలల్లోనే ప్రాక్టీస్ మొదలెట్టింది.






