calender_icon.png 26 May, 2025 | 12:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తనపై ఉన్న కుట్రతోనే ఆరోపణలు

25-05-2025 08:05:52 PM

విలేకరుల సమావేశంలో డాక్టర్ దశరథ..

కోదాడ: ఉన్నత స్థానంలో ఉన్న తన పరువు ప్రతిష్టలను భంగం కలిగించేందుకు కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నారని కోదాడ ప్రభుత్వ వైద్యశాల సూపరిండెంట్ డాక్టర్ దశరథ(Superintendent Dr. Dasharatha) అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని పెరిక హాస్టల్ ఆవరణలో ఆత్మకూర్ ఎస్ మండలం దుబ్బ తండ నుండి కనికరం లేని దశరథ కరుణించు అనే శీర్షికతో ఆదివారం ఓ పత్రికలో ప్రచురితమైన వార్తను ఖండిస్తూ కుటుంబ సభ్యులతో కలిసి విలేకరుల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి తావుర్య సవతి తల్లి బుజ్జమ్మలను తాను అన్ని రకాలుగా చూసుకుంటున్నానని అన్నారు.

తన బావ లకావత్ సైదా ఉన్నత స్థానంలో ఉన్న తనపై ఈర్షద్వేషాలతో తల్లిదండ్రులతో ఈ ఆరోపణలు చేయించాడు అన్నారు. నేను దుబ్బ తండాలో ఎవరి భూములు అమ్ముకోలేదని తన కష్టార్జితంతో సంపాదించిన భూమిని మాత్రమే అమ్ముకున్నానని అన్నారు. కుటుంబ సభ్యుల అభివృద్ధికి ఎంతో తోడ్పడును అందించానన్నారు. అందరూ తల్లిదండ్రుల మాదిరిగానే తన పిల్లలను చదివించడం మూలంగానే డాక్టర్లు అయ్యారని ఎవరికి అన్యాయం చేసి తాను ఉన్నత స్థాయికి ఎదగలేదన్నారు.

ప్రస్తుతం తన తండ్రితో ఆరోపణలు చేయించిన తన పిన్ని బుజ్జమ్మ సొంత తల్లి కాదని అయినా నేను ఏనాడు సవతి తల్లి ఉద్దేశంతో చూడలేదని కన్న తల్లిగానే భావించానని ఆవేదన వ్యక్తం చేశారు. బాల్యంలోనే తల్లిని కోల్పోయిన నేను గిరిజన సంక్షేమ హాస్టల్లో చదువుకొని అనేక కష్టాలు పడి డాక్టర్ కోర్సు పూర్తి చేసి నేడు ఈ ఉన్నత స్థాయికి ఎదిగానని అయినప్పటికీ తల్లిదండ్రులు అంటే గౌరవమే అని ఇప్పటికైనా తన తల్లిదండ్రులు వస్తే వారి సంరక్షణ బాధ్యతగా భావించి చూసుకుంటానన్నారు. సమాజంలో నన్ను ద్రోహిగా చిత్రీకరించే విధంగా ఆరోపణలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా అన్నారు. వాస్తవాలపై దుబ్బ తండాలో సైతం విచారణకు సిద్ధమేనని వెల్లడించారు.