25 May, 2026 | 6:09 AM

నిన్న పారిస్ సిల్వర్ మెడలిస్ట్.. నేడు రెస్టారెంట్ లో పని

20-08-2024 12:03 PM

బీజింగ్: చైనా జిమ్నస్ట్ జౌ యాకిన్ .. ఇటీవల పారిస్ ఒలింపిక్స్ లో 18 ఏళ్లకే  సిల్వర్ మెడల్ నెగ్గి సత్తా చాటింది.  అమాయక మైన ఈ ముద్దు గుమ్మ నగుమోము చూసి నెటిజనులు తెగ ముచ్చట పడి పోయారు.  కానీ పతకం సాధించి స్వదేశ:లో యథావిధిగా రెస్టారెంట్ లో భోజనం వడ్డిస్తూ  తన బాధ్యతలు నిర్వహించింది. హునాన్ ప్రావిన్స్ లోని హెన్ గ్యాంగ్ నగరంలో జౌ యాకిన్ కుటుంబానికి రెస్టారెంట్ ఉంది. తల్లి దండ్రులకు సాయంగా ఉంటూ రెస్టారెంట్ కు వచ్చే కస్టమర్లకు ఒలింపిక్ దుస్తులలోనే వడ్డిస్తూ పలువురి ప్రశంసలు అందుకుంది. వర్క్, లైఫ్ బ్యాలెన్స్ కు సరైన ఉదహారణ అని మెచ్చుకుంటున్నారు. ఒలింపిక్ విజయం, కుటుంబ బాధ్యతలను బ్యాలెన్స్ చేస్తోందంటూ నెటిజెన్సు ఆమెకు కితాబిచ్చారు. సిల్వర్ మెడలిస్ట్ గా ఎలాంటి యాటిట్యూడ్ చూపని ఈ చీనీ ముద్దుగుమ్మ పారిస్ లోనే విశ్వ క్రీడలకు అరంగేట్రం చేసింది. మహిళల బ్యాలెన్స్ బీమ్ ఈవెంట్ లో రజత పతక విజేతగా నిలిచింది.