కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
20-08-2024 12:40 PM
ఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో జైలులో ఉన్న బీ ఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్ ను వచ్చే మంగళవారం (ఆగస్టు 27) విచారణ జరుపుతామని న్యాయస్థానం ప్రకటించింది. మద్యం కుంభకోణం కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఈ మేరకు కౌంటర్ దాఖలుకు మరికొంత సమయం కావాలని ఈడీ కోరింది. కాగా ఈడీ, సీబీఐ కౌంటర్‌లపై రీజాయిండర్ వేస్తామని కవిత న్యాయవాదులు పేర్కొన్నారు.






