29 June, 2026 | 12:38 PM

కడెం.. కలవరం!

13-06-2024 02:55 AM
  • ప్రాజెక్టు మరమ్మతుల్లో మందగమనం

రూ.5.46 కోట్లతో సాగుతున్న పనులు

జపాన్ టెక్నాలజీపైనే అధికారుల దృష్టి

ఈసారి వరదలను తట్టుకునేనా..?

ఆయకట్టు రైతుల్లో ఆందోళన

వానాకాలం వచ్చేసింది. ముందస్తు వర్షాలు పడతాయని వాతావారణ శాఖ సైతం సంకేతాలిచ్చింది. రైతులందరిలో సంతోషం నింపే ఈ వార్త నిర్మల్, మంచిరాల్యజిల్లాల రైతుల్లో మాత్రం ఆందోళన పట్టుకుంది. కడెం ప్రాజెక్టు మరమ్మతు పనుల్లో మందగమనం కర్షకులను కలవరానికి గురిచే స్తున్నది. నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లోని 55 వేల ఎకరాలకు ఈ ప్రాజెక్టు నీరు అందించాల్సి ఉంది. 

-  నిర్మల్, జూన్ 1౨ (విజయక్రాంతి)

కడెం, దస్తురాబాద్, జన్నారం, దండేపల్లి, లక్షెట్టిపేట్, మంచిర్యాల మండలాల్లోని ఆయా గ్రామాల రైతులకు ఈ ప్రాజెక్టు నీరే వరి సాగుకు భరోసా. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 700 అడుగులు (7.01 టీఎంసీ లు). ప్రతి సంవత్సరం జూన్, జులై మాసా ల్లో కురిసన వర్షాలకు ఈ ప్రాజెక్టు జలకళతో ఉట్టిపడుతుంది. దీంతో వానాకాలం, రబీ.. రెండు పంటలకు సాగునీటికి ఢోకా లేదు. అయితే ఈ ప్రాజెక్టు నిర్మించి ఐదు దశాబ్దాలు గడిచిపోవడంతో నిర్వహణ లోపాలు తలెత్తుతున్నట్టు తెలుస్తోంది.  రెం డేండ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తింది. నీటిని దిగువకు వదిలిపెట్టేందుకు గేట్లు మొరాయించాయి.

దీంతో వరద గేట్ల పైనుంచి పొంగి ప్రవహించింది. ఈ క్రమంలో ప్రాజెక్టు కొట్టుకుపో తుందేమోనన్న భయంతో ప్రాజెక్టు కింది గ్రామాలను ఖాళీ చేయించిన సంగతి అందరికీ తెలిసిందే. గేట్లు మరమ్మతులు తూతూ మంత్రంగా ఉండడం, అసలు సమయంలో అవి పైకి లేవకపోవడంతో వరద కిందికి పంపేందుకు ఆటంకాలు ఎదురవుతున్నా యి. దీంతో ప్రతి సంవత్సరం రైతులు,అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. కడెం ప్రాజెక్టుకు ప్రతీ సంవత్సరం రికార్డు స్థాయి లో వరద ఉంటుంది. గేట్ల ద్వారా మూడున్నర లక్షల క్యూసెక్కుల నీరు పంపేందుకు వీలున్నా అంతకంటే వరద ఎక్కువగా వస్తే ప్రాజెక్టు అధికారులు చేసేదేమీ లేక చేతులు ఎత్తేస్తున్నారు. రెండేండ్ల క్రితం వరద పెరిగి ప్రాజెక్టు తెగే వరకు రావడంతో ప్రభుత్వం ఆలస్యంగానైనా స్పందించింది.

మరమ్మతుల్లో మందగమనం..

కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు మరమ్మతులకు ప్రభుత్వం రూ.5.46 కోట్లు మంజూ రు చేసింది. అదనంగా రూ.1.41 కోట్లు కూడా కేటాయించింది. ఆ నిధులతో జర్మనీ టెక్నాలజీతో గేట్ల మరమ్మతులు, అఫ్రాన్ రక్షణ గోడలు, సిమెంట్ స్పిల్ వే వంటి పనులు జరుగుతున్నాయి. 18 వరద గేట్లు రిపేరు చేస్తున్నారు. 11,15వ నంబర్ గేట్లను కొత్తగా బిగిస్తున్నారు. తుప్పుపట్టిన గేట్లను సైతం తొలగిస్తున్నారు. నిర్మల్ నీటి పారుదల శాఖ సీఈ శ్రీనివాస్ పనులను పర్యవేక్షి స్తున్నారు. అయితే ఈ పనులు పూర్తి కావడానికి ఇంకా నెల రోజులు సమయం పట్టొచ్చ ని తెలుస్తోంది.

ఈ లోగా వర్షాలు కురిసీ.. వరద పోటెత్తితే.. ప్రాజెక్టు తట్టుకుంటుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోపక్క కడెం ప్రాజెక్టు పరీవాహక ప్రాంతమైన కడెం, సిరిచెల్మ, నేరడిగొండ, బజార్ హత్నూర్, బోథ్, సొనాల తదితర ప్రాంతా ల్లో వర్షపాతం అంచనా వేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పనులు పూర్తి కావడానికి సమయం పట్టనుండడంతో వరద వస్తే నీళ్లు ఆగతాయో లేదోనన్న బెంగ ఇటు అధికారులకు, ఇట రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.