హర్మన్ హ్యాట్రిక్
28-05-2024 01:25 AM
అర్జెంటీనాపై భారత్ విజయం
ఆంట్వెర్ప్ (బెల్జియం): ఎఫ్‌ఐహెచ్ ప్రొ హాకీ లీగ్‌లో భారత పురుషుల హాకీ జట్టు మరో విజయం ఖాతాలో వేసుకుంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ హ్యాట్రిక్ గోల్స్‌తో మెరవడంతో భారత్ 5 అర్జెంటీనాపై ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. భారత్ తరపున హర్మన్ ప్రీత్ (29వ, 50వ, 52వ నిమిషాల్లో), అరైజీత్ సింగ్ (7వ ని.లో), గుర్జాంత్ సింగ్ (18వ ని.లో) గోల్స్ చేశారు. అర్జెంటీనా తరపున ఫెడ్రికో మోంజా (3వ ని.లో), నికోలస్ కీనన్ (24వ ని.లో), టాడియో మారుస్సీ (54వ ని.లో), లుకాస్ మార్టినేజ్ (57వ ని.లో) తలా ఒక గోల్ చేశారు. దీంతో లీగ్‌లో రెండు వరుస పరాజయాలకు భారత్ చెక్ పెట్టినట్లయింది.






