సమస్యలు పరిష్కరించాలని సింగరేణి అధికారుల నిరసన
25-06-2026 12:00 AM
నస్పూర్, జూన్ 24: శ్రీరాంపూర్ ఏరియాలో అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని బుధవారం అధికారులు నిరసన వ్యక్తం చేశారు. ఉదయం నుంచే నల్లబ్యాడ్జీలు దరించి విధులు నిర్వహించిన అధికారులు సాయంత్రం జీఎం కార్యాలయం పరిధిలో ప్రోటెస్ట్ తెలిపారు.
సీఎంఓఏఐ శ్రీరాంపూర్ అధ్యక్షులు లక్కాకుల మహేష్ నాయకత్వంలో శ్రీరాంపూర్ ఏరియా అధికారులు శ్రీరాంపూర్ జీఎం కా ర్యాలయ వేధిక ప్రాంగణంలో తమ డిమాం డ్లు పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎంఓ ఏఐ శ్రీరాంపూర్ ఏరియా అధ్యక్షులు లక్కాకుల మహేష్, జనరల్ సెక్రటరీ మల్లయ్య, జాయింట్ సెక్రటరీ భీమన్న, ట్రెజరర్ పద్మలతో పాటు శ్రీరాంపూర్ ఏరియా అన్ని గనులు, కార్యాలయాల అధికారులు, మహిళా అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






