23 July, 2026 | 1:53 AM

బాధిత కుటుంబానికి సింగిరెడ్డి పరామర్శ

23-07-2026 12:00 AM

వనపర్తి మండలం, జూలై 22: మండల పరిధిలోని అచ్చుతాపూర్ గ్రామానికి చెంది న సిలిమార్తి చిట్టెమ్మ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలుసుకు న్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బుధవారం వారి నివాసానికి వెళ్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ జిల్లా నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.