23 July, 2026 | 1:51 AM

ప్రత్యమ్నాయ పంటలు పండించండి

23-07-2026 12:00 AM

కలెక్టర్ ఖుష్బూ గుప్తా

 భూత్పూర్ జూలై 22 : రైతులు సాంప్రదాయ పంటలు కాకుండా ప్రత్యమ్నయ పం టలు పండించి అధిక దిగుబడి పొందాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. బుధవారం భూత్పూర్ మండలం రైతు వేదికలో  జిల్లా వ్యవసాయ శాఖ సహకారంతో కోరమాండల్ ఇంటర్నేషనల్  నిర్వహించిన గ్రో మోర్ నానో ఎరువుల అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ ఖుష్బూ గుప్తా మాట్లాడారు.

అధికారులు రైతులకు చెబుతున్న విధానాలను పూర్తిస్థాయిలో పాటించి ఏలినో ద్వా రా వర్షాలు తప్పక చూడడం ద్వారా నీరు ఎ క్కువగా వినియోగించే పంటలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రతి విషయంలోనూ వ్యవసాయ అధికారులు సూచనలు సలహాలు తీసుకొని పంటలు పండించాలని చెప్పారు.  అనంతరం తాసిల్దార్ కార్యాల యం, పీహెచ్‌సీలను తనిఖీ చేశారు. అవసరమైన సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో  తహసిల్దార్ కిషన్,మెడికల్ ఆఫీసర్ అబ్దుల్ రబ్, తదితరులు ఉన్నారు.