21 March, 2026 | 7:25 PM

Breaking News

మున్సిపాలిటీలోని రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉంచాలి   •   అభివృద్ది పనులను పరిశీలించిన ఎంఎల్ఏ   •   ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర   •   అంజనాద్రిని దర్శించుకున్న పిఆర్టియు రాష్ట్ర అధ్యక్షులు   •   నిర్మల్ బుద్ధ విహార్‌లో 6వ రోజు కొనసాగిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భీమ్ జ్ఞాన దీక్షలు   •   కామారెడ్డి డిక్లరేషన్ కు కార్యరూపం ఎప్పుడూ...?   •   టీజీ ఆర్టీసీ ఆధ్వర్యంలో కాశీ అయోధ్యకు బస్సు సర్వీసు   •   గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు సాధించాం   •   కుల మతాల కతీతంగా మతసామరస్యానికి ప్రతీక రంజాన్   •   ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి   •  

న్యాయవాదుల సహకార గృహనిర్మాణ సంఘం అధ్యక్షుడిగా సింగిరెడ్డి లక్ష్మారెడ్డి

24-07-2024 04:51 PM

కరీంనగర్: కరీంనగర్ జిల్లా న్యాయవాదుల సహకార గృహనిర్మాణ సంఘం అధ్యక్షుడిగా బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది సింగిరెడ్డి లక్ష్మారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాద్యక్షులుగా తిరుమలదేవి, ప్రదాన కార్యదర్శిగా నగునూరి పరమేశ్వర్, కోశాధికారిగా ధనుక రాజశేఖర్‌ రావులు ఎన్నికయ్యారు. మంగళవారము జరిగిన ఈ ఎన్నికలలో 341 న్యాయవాదులు సబ్యత్వం కలిగి ఉండగా 241మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.

వీరూ 9 మంది  డైరెక్టర్లుగా నగునూరి పరమేశ్వర్, సింగిరెడ్డి లక్ష్మారెడ్డి, పివి.రాజ్‌కుమార్, హర్కాల చక్రధర్, దాసరి రాంరెడ్డి, పూరెళ్ల రాములు, ఎస్ సి ఎస్ టి విభాగాల్లో ధనుక రాజశేఖర్ రావు . మహిళా విభాగం లో పొత్తూరి భాగ్యలక్ష్మి,  మూల తిరుమలా దేవిలను ఎన్నుకున్నారు. ఈ నియామకం పట్ల బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు రఘునందన్ రావు,  బల్మూరి మహేందర్ రావు, రాష్ట్రం సర్పంచ్‌ల ఫోరం మాజీ అధ్యక్షుడు న్యాయవాది ఉప్పుల అంజనీప్రసాద్, ఎజిపి లు కె.లక్ష్మయ్య,కూర శ్రీనివాస్ రెడ్డి,  కాంగ్రెస్ నాయకులు రాచకొండ ప్రభాకర్, కుమారస్వామి, సీనియర్ జూనియర్ మహిళా న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.