28 February, 2026 | 9:15 AM

డ్యూడ్ నుంచి సింగారి సింగిల్

06-10-2025 12:44 AM

తమిళ యువ నటుడు ప్రదీప్ రంగనాథన్, ‘ప్రేమలు’ ఫేం మమిత బైజు జంటగా మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పాన్ ఇండియా చిత్రం ’డ్యూడ్. మూవీకి సంబంధించి తాజా థర్డ్ సింగిల్ విడుదలైంది. ’సింగారి పేరుతో విడుదలైన ఈ పాట శ్రోతలను ఆకర్షిస్తున్నది. వరుస బ్లాక్బస్టర్లతో దూసుకుపోతున్న ప్రదీప్ రంగనాథన్ నటిస్తున్న ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ స్వరపరిచి ఆలపించిన ’సింగారి’ సాంగ్‌కు రామజోగయ్య శాస్త్రి ఆకట్టుకునే సాహిత్యం అందించారు. ఇప్పటికే ’బూమ్ బూమ్’, ’బాగుండు పో’ పాటలతో చార్ట్ బస్టర్ హిట్లను అందుకున్న సాయి అభ్యంకర్.. ఎనర్జిటిక్ బీట్స్, క్యాచీ లిరిక్స్తో కూడిన ఈ కొత్త ఫన్ ట్రాక్తో యువతలో మరింత క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రదీప్ కామెడీ టైమింగ్, శరత్ కుమార్ నటన, నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నది. ఈ భారీ బడ్జెట్ మూవీ ఈనెల 17న దీపావళి కానుకగా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.