calender_icon.png 14 June, 2025 | 6:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగిల్ లైఫే సూపర్ యార్..

12-06-2025 12:00:00 AM

ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ముల కాబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న పాన్‌ఇండియా సినిమా ‘కుబేర’. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్ కాగా, జిమ్‌సర్బ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. శ్రీవేంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్‌మోహన్‌రావు నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 20న విడుదల కానుంది.  ఈ సినిమా థర్డ్ సింగిల్ ‘పీపీ డుమ్‌డుమ్’ ట్రాక్‌ను బుధవారం అఫీషియల్‌గా రిలీజ్ చేశారు.

దేవిశ్రీప్రసాద్  స్వరపర్చిన ఈ పాట ‘పీపీపీ డుమ్‌డుమ్‌డుమ్.. నమస్తే గాళ్సూ.. ఆర్ యూ రెడీ టూ డ్యాన్సూ.. అంటూ ప్రారంభమై తెలుగు ఆంగ్ల పదాల సమ్మిళిత సాహిత్యంతో యువతను ఆకట్టుకునేలా ఉంది. ‘ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్.. సింగిల్ లైఫే సూపర్ యార్..’ అంటూ సాగే ఈ ట్రాక్ సింగిల్స్ లైఫ్‌ను ప్రజెంట్ చేస్తోంది. ఈ పాటకు చైతన్య పింగళి సాహిత్యం అందించగా, ఇంద్రావతి చౌహాన్ ఆలపించింది.