8 వసంతాలు పరిచయమిలా..
అనంతిక సనీల్‌కుమార్ లీడ్ రోల్ పోషించగా ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన కాన్సెప్ట్- సెంట్రిక్ మూవీ ‘8 వసంతాలు’. హనురెడ్డి, రవితేజ దుగ్గిరాల, సంజన, కన్నా, స్వరాజ్ రెబ్బా ప్రగడ, సమీరా కిషోర్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవికుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 20న విడుదల కానుంది.
చిత్రబృందం తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ‘పరిచయమిలా..’ను రిలీజ్ చేసింది. ‘కనులకు తెలియని కలలను కంటున్నా.. ఇదివరకెరుగని ఉదయము చూస్తున్నా.. మంచు మేఘమే ఇలా.. ఒక గాలివానలా.. మదినే తాకి లోలోన మాయేదో చేస్తున్నదే.. పరిచయమిలా.. పరిమళములా.. మనసునంటి వదలదేలా.. తలపునిలా నిలపడమెలా..
ఎదను దాటి ఎగసెనెలా..’ అంటూ సాగుతోందీ పాట. హేషమ్ అబ్దుల్ వహాబ్ మెలోడీగా స్వరపర్చిన ఈ పాటకు వనమాలి సాహిత్యం అందించగా, కేఎస్ ఆలపించారు. ఈ చిత్రానికి డీవోపీ: విశ్వనాథ్‌రెడ్డి; యాక్షన్ కొరియోగ్రఫీ: వింగ్ చున్ అంజి.




