25-05-2025 01:10:47 PM
మంథని, (విజయక్రాంతి): రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) ఆదేశాల మేరకు కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు వెళ్ళే భక్తుల కోసం మంథని పట్టణంలో ఏర్పాటు చేసిన ఉచిత బస్సు సౌకర్యాన్ని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. మంత్రి శ్రీధర్ బాబు(Sridhar Babu) పంపించిన తీర్థ ప్రసాదాలను తాడిచర్ల సమీపంలో భక్తులకు అందజేశారు. కాళేశ్వరం వెళ్లే భక్తులకు సింగిల్ విండో చైర్మన్ కొత్త అరటి పండ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చాట్లపల్లి సంతోష్, ఎడ్ల శ్రావణ్ ,సాదుల శ్రీకాంత్, నిఖిల్ ఆరెళ్ళి వరున్, భూడిధ రమేష్, చల్ల మహేందర్, అవుల సంతోష్, చాట్లపల్లి మధు, ఉస్సెన్ భీ, తదితరులు పాల్గొన్నారు.