calender_icon.png 25 May, 2025 | 5:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెప్పడం కాదు చేసి చూపిస్తున్నాం..

25-05-2025 01:14:53 PM

  1. అభివృద్ధి అంటే పునాదుల్లో నుంచి ప్రారంభించడం
  2. విజన్-2047 వరకు 100 యేండ్ల ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాం 
  3. రూ 500 కోట్ల తో  త్రిపుల్ ఐటి కళాశాల ఆవిష్కృతం
  4. ఎడ్యుకేషన్, ట్రాన్స్పోర్టేషన్ హబ్ గా మహబూబ్ నగర్ ఆవిష్కృతమవుతుంది 
  5. విలేకరుల సమావేశంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): అభివృద్ధి అంటే కాగితాలు పట్టుకొని జరుగుతుంది ? అయిపోతుంది ?  అని చెప్పడం కాదని.. పునాదుల్లో నుంచి ప్రారంభించి కళ్ళకు కనిపించేలా చూపించడమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) స్పష్టం చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వందేళ్ల ను పరిగణలోకి తీసుకుంటూ విజన్ - 2047 వరకు మహబూబ్ నగర్ అభివృద్ధి అన్ని రంగాల్లో ఉన్నత స్థాయిలో నిలిచేందుకు అవసరమైన చర్యలు పక్క ప్రణాళిక బద్ధంగా తీసుకుంటున్నామని తెలిపారు. ఈ పనులను ముందుకు తీసుకుపోయేందుకు కంకణ బద్ధులమై పనిచేస్తున్నామని స్పష్టం చేశారు.

ఇప్పటికే పట్టణంలోని మేధావులతో పాటు పక్క సర్వే రిపోర్ట్ తీసుకొని భవిష్యత్తు ప్రణాళికలను చేశామన్నారు. అటవీ, జల, ఖనిజ సంపదతో మహబూబ్ నగర్ నగర్ ఉన్నత స్థాయికి చేరుకుంటుందని తెలిపారు. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ చేయాలని సంకల్పంతో ముందుకు సాగుతున్నామని, మరో బైపాస్ రోడ్డు శ్రీకరం చుట్టేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఒకే రోజులో అభివృద్ధి జరగదని, రాయిచూర్, కర్ణాటక, గోవా, బెంగళూరు, సోలాపూర్ తో పాటు వివిధ ప్రాంతాలకు మహబూబ్ నగర్ కేంద్ర బిందువుగా ఉందని, ఎడ్యుకేషన్, ట్రాన్స్పోర్టేషన్ హబ్ గా ప్రత్యేక గుర్తింపు లభించడం జరుగుతుందన్నారు. 

ఉద్యమ ఫలితమే పాలమూరు యూనివర్సిటీ ఏర్పాటు...

తెలంగాణ ఉద్యమ ఫలితమే 2008 సంవత్సరంలో అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి పాలమూరు యూనివర్సిటీ తో పాటు మరో మూడు యూనివర్సిటీలను రాష్ట్రంలో నెలకొల్పడం జరిగిందన్నారు. ఉద్యోగాన్ని వదులుకొని తెలంగాణ తేవాలని సంకల్పంతో రాష్ట్రాన్ని సాధించుకున్నామని, పదేళ్ల పరిపాలన బాలేదని కెసిఆర్ ను పక్కకు జరిపి ప్రజా పాలన తెచ్చుకున్నామని తెలిపారు.  పాలమూరు యూనివర్సిటీకి రూ 100 కోట్ల పండును తెచ్చుకోవడం తోపాటు, ఈ ఏడాది నుంచే ఇంజనీరింగ్ కళాశాల, లా కళాశాల తరగతులు ప్రారంభించడం జరుగుతుందన్నారు. 

మహబూబ్ నగర్ అభివృద్ధి ఆగదు...

ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన మహబూబ్ నగర్ అభివృద్ధి ఆగదని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రూ 500 కోట్ల తో త్రిబుల్ ఐటీ కళాశాల ఆవిష్కృతం కాబోతుందని చెప్పారు. ఒక్కొక్కటిగా మహబూబ్ నగర్ అభివృద్ధి ఎవరు ఊహించినంత జరగడం ఖాయమన్నారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తో పాటు ప్రతి పని పక్కాగా జరిగేలా ఫైనాన్స్ శాఖ అనుమతులను తీసుకుంటూ ముందుకు సాగుతున్నామన్నారు. త్వరలోనే పూలే అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం పండ్లను ప్రారంభించేందుకు శంకుస్థాపన చేయడం జరుగుతుందన్నారు. ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని, భవిష్యత్తులో మహబూబ్ నగర్ కాలనీలు మరింత అత్యధికంగా గ్రోత్ తో ముందుకు సాగుతుందని, అవసరమైన ప్రణాళికలతో పనులను చేస్తున్నామన్నారు. 

కాగితాలు చూపెట్టి అభివృద్ధి అంటలే...

ఏవో కాగితాలు తీసుకొచ్చి ఏదో నెంబర్ చెప్పి ఇది జీవో అంటూ అభివృద్ధి జరిగిపోతుందిగా అని మాయమాటలు చెప్పే వ్యక్తిని కాదని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కాన్వెంట్ గా గొప్ప లక్ష్యంతో అప్రూవల్ తీసుకొని పనులు చేస్తున్నామని తెలిపారు. విజన్ 2047 వందేళ్లకు సరిపడా ప్రణాళికతో అభివృద్ధి ముందుకు సాగుతుందన్నారు. కోయిల్ సాగర్, నాగసాల నుంచి పతనానికి తాగునీరు వస్తుందని తెలిపారు. తాగునీరు అవసరం నిమిత్తం పట్టణానికి సంబంధించి వివిధ పనులు చేసేందుకుగాను రూ 220. 94 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం మహబూబ్ నగర్ జనాభా 3 లక్షలు ఉందని, 2047 ఏడాది లోపు 5 లక్షల జనాభా చేరుకునే అవకాశం ఉంటుందని ఇందుకు సంబంధించిన కూడా 60 ఎంఎల్డిల తాగునీరు అవసరం ఉంటుందని అంచనా వేయడం జరిగిందన్నారు.

అర్బన్ చాలెంజ్ ఫండ్ ను కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని సమాచారం రావడంతో రాష్ట్ర ప్రభుత్వం కోరిన వెంటనే అంతకుముందే తయారు చేసుకున్న రూ 736 కోట్లతో అభివృద్ధి పనులు అవసరం ఉందని ఫైల్ను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడం జరిగిందన్నారు. అమలుకు దూరంగా ఉన్న అమృత స్కీంను తిరిగి ప్రారంభించి రూ 269 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరుగుతుందన్నారు. ప్రతి విషయంలోనూ పక్కాగా కంకణబద్ధులమై సహాయ శక్తులుగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ అభివృద్ధిలో కాంగ్రెస్ నాయకులతోపాటు ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు ఉన్నాయని వివరించారు. ఈ సమావేశంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బేక్కరి అనిత మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు వినోద్ కుమార్, బెనహర్ తదితరులు ఉన్నారు.