మెదడులో కణితి తొలగింపు
కేర్ ఆస్పత్రిలో విజయవంతంగా చికిత్స
హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి): హైదరాబాద్‌కు చెందిన 42 ఏళ్ల మహిళ రెండు నెలలుగా తీవ్రమవుతున్న తలనొప్పి, అనంతరం మూర్ఛ రావడం తో ఆస్పత్రికి వెళ్లగా, మెదడులో కుడివైపు స్ఫినాయిడ్ వింగ్ ప్రాంతంలో 4.5 సెం. మీ. పరిమాణంలో మెనింజియోమా క ణితి ఉన్నట్లు గుర్తించారు. మెదడులోని కీలక భాగాలు, ప్రధాన రక్తనాళాలకు అ త్యంత సమీపంలో ఉన్న ఈ కణితిని కేర్ హాస్పిటల్స్, మలక్‌పేట్‌లో కన్సల్టెంట్ న్యూరోసర్జన్ డాక్టర్ భవానీ ప్రసాద్ గంజి నేతృత్వంలోని వైద్య బృందం రైట్ ఫ్రంటోటెంపోరల్ క్రానియోటమీ ద్వారా విజయవంతంగా పూర్తిగా తొలగించింది. శస్త్రచికిత్స అనంతరం హిస్టోపాథాల జీ పరీక్షలో అది మెనింజియోమా అని నిర్ధారణ అయింది.
రోగి ఒక్కరోజు ఐసీయూలో ఉండి, నాలుగో రోజే డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం పూర్తిగా కోలుకుని సాధారణ జీవితం గడుపుతున్నారని వైద్యులు తెలిపారు. కేర్ హాస్పిటల్స్, మలక్పేట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ ఎడ్ల మాట్లాడుతూ, క్లిష్టమైన నాడీ సంబంధిత వ్యాధుల్లో సకాలంలో నిర్ధారణ, నిపుణుల చికిత్స ఎంతో కీలకమని పేర్కొన్నారు. డాక్టర్ భవానీ ప్రసాద్ గంజి మాట్లాడుతూ, తలనొప్పితో పాటు మూర్ఛ, చూపులో మార్పులు లేదా శరీర బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.






