‘సర్’ను వేగంగా పూర్తి చేయాలి : ఎమ్మెల్యే
దామరచర్ల,జులై 9 : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని వేగవంతం గా పూర్తి చేయాలని మిర్యాలగూడ ఎమ్మెల్యేబత్తుల లక్ష్మారెడ్డి సూచించారు.దామరచర్ల మండలం లోని కొండ్రపోల్ గ్రామంలో కొనసాగుతున్న సర్ కార్యక్రమాన్ని గురువారం పరిశీలించారు.ప్రతి బూత్లో నమోదవుతున్న ఓటరు వివరాల సవరణ ప్రక్రియ, అర్హులైన ఓటర్ల నమోదు, అవసరమైన ధ్రువపత్రాల పరిశీలన, ప్రజలకు అందుతున్న సేవలపై ఆయన సమగ్రంగా ఆరా తీశారు. పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా మరియు నిర్ణీత గడువులోపు పూర్తయ్యేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
అనంతరం బూత్ లెవల్ అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే, పెండింగ్లో ఉన్న దరఖాస్తులను ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రతి అర్హుడైన ఓటరికి న్యాయం జరిగేలా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. బూత్ లెవల్ ఏజెంట్లు పూర్తి బాధ్యతతో వ్యవహరిస్తూ, ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రక్రియలో ఓటరు జాబితా అత్యంత కీలకమని, ప్రతి అర్హుడి పేరు జాబితాలో ఉండేలా అధికారులు, బి ఎల్ ఓ లు , బి ఎల్ ఏ లు సమిష్టిగా కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, పాల్గొన్నారు.






