సర్ ప్రక్రియ పూర్తి అయ్యేవరకు అప్రమత్తంగా ఉండండి
నిర్మల్, ఆగస్టు 27 ( విజయ క్రాంతి): సర్ ప్రక్రియ పూర్తి అయ్యేవరకు కాంగ్రెస్ పార్టీ నేతలందరూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్, ఎస్‌ఐఆర్ నిర్మల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ తాహెర్ బీన్ ఆమ్దాన్ అన్నారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం (ఎస్‌ఐఆర్)లో భాగంగా సోన్ మండలం కడ్తాల్ గ్రామం, సిద్ధల కుంట, లక్ష్మణ చందా మండలం బాబాపూర్, మామడ మండలం కొరటికల్, దిమ్మదుర్తి, దిలావర్పూర్ మండలం కంజర్ మరియు మాడెగాం, నర్సాపూర్ మండలం మరియు నర్సాపూర్ గ్రామాలలో గురువారం నిర్వహించిన గ్రామసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్ లో భాగంగా విడుదలైన ముసాయిదా ఓటరు జాబితాలో ఎవరి పేర్లలోనైనా తప్పులు ఉన్నా, ఇతర సమస్యలు ఉన్నా సంబంధిత ఆధారాలతో అధికారులను సంప్రదించి సరిచేసుకోవచ్చన్నారు. . ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుర్రం రాము, నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమా భీంరెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు గాజుల రవికుమార్, ఆత్మ కమిటీ చైర్మన్ రామ్ రెడ్డి, శ్రీ గండి రామన్న దత్త సాయి ఆలయ చైర్మన్ కొట్టే శేఖర్, కాంగ్రెస్ పార్టీ వివిధ మండల అధ్యక్షులు మోహినొద్దీన్, కోండ్రు నరేష్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, మోతిలాల్, డిసిసి కార్యదర్శి మహమ్మద్ జీషాన్ అలీ మరియు గ్రామ కార్యదర్శులు, ఆర్‌ఐ లు , జీపీఓ , బీఎల్‌ఓలు , వార్డు సభ్యులు, బీఎల్‌ఏలు పాల్గొన్నారు.






