సీవోఈను విమర్శించడం సరికాదు
ఆటగాళ్లకు గాయాలు సహజం
ఏ ఒక్కరినో బలిపశువును చేయొద్దు
వీవీఎస్ లక్ష్మణ్ వ్యాఖ్యలు
బెంగళూరు, ఆగస్టు 9: కొంతకాలంగా టీమిండియాలో గాయాల ట్రెండ్ నడుస్తోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 13 మంది ఆటగాళ్లు గాయాల బారిన పడ్డారు. వారంతా ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో కోలుకుంటున్నారు. ఎన్నో సౌకర్యాలు ఉన్నా ఆటగాళ్లు వరుస గాయాల బారిన పడి పూర్తిస్థాయిలో కోలుకోకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజానికి గాయపడిన తర్వాత చికిత్స, అనంతరం రికవరీ ప్రక్రియ సీవోఈలో కీలకం. ఇప్పుడు ఇదే విషయంలో సందేహాలు, గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
ఒకదశలో సీవోఈ పనితీరుపై విమర్శలు కూడా వచ్చాఇయి. బీసీసీఐ సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తూ తాజాగా సెక్రటరీ దేవజిత్ సైకియా సీవోని సందర్శించారు. ఈ సందర్భంగా సీవోఈ చీఫ్‌గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్ తో కలిసి ఆటగాళ్ల గాయాలు, ఫిట్‌నెస్ ఇతర అంశాలపై వివరాలు అడిగితెలుసుకున్నారు. అయితే ఆటగాళ్ల గాయాలు, రికవరీ ప్రక్రియకు సంబంధించి సీవోఈని తప్పుపట్టడం సరికాదని వీవీఎస్ లక్ష్మణ్ వ్యాఖ్యానింటాడు.
బీసీసీఐ సీఓఈ కేవలం ఆటగాళ్ల పున రావసకేంద్రం మాత్రమే, ఆటగాళ్లు రాణించడంలో కూడా తోడ్పాటును అందిస్తుందని తెలిపారు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, సాయి సుద ర్శన్ గాయాలతో లంక పర్యటనకు దూరమవ్వడంతో సీఓఈ పనితీరుపై ప్రశ్నలు తలె త్తాయి. అయితే ఆటగాళ్ల ్ల గాయాలకు సీఓఈని నిందించడం సరికాదని లక్ష్మణ్ అభిప్రా యపడ్డాడు. ఏ ఆటగాడి కెరీర్లోనైనా గాయాలు సర్వసాధారణం. అందుకే పర్యవేక్షణ వ్య వస్థ చాలా కీలకం. ఆటగాళ్ల గాయాలకు ఇతరులను నిందించడం సరికాదు. అలా చేస్తే బలిపశువులను వెతుకుతున్నట్లే అవుతుందిఅని లక్మణ్ చెప్పుకొచ్చాడు.
ఇదిలా ఉంటే గాయాల బెడద పెరుగుతున్న నేపథ్యంలో బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా సీఓఈలో ప్లేయర్ ఇంజ్యూరి మేనేజ్‌మెంట్‌ను ప్రత్యేకంగా సమీక్షించారు. కాగా 2025లో నితిన్ పటేల్ రాజీనామా చేయడంతో బీసీసీఐ ఆ పోస్టుకు మరో వ్యక్తిని నియమించక పోవడంతో ఆ ప్రభావం కనిపిస్తోంది. ప్రస్తుతం ధనంజయ్ కౌశిక్ బెంగళూరు సీఓఈలో స్పోర్ట్స్ సైన్స్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం బుమ్రాతో పాటు హర్షిత్ రాణా, నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుం దర్, హార్దిక్, ఆకాష్ దీప్, సాయి సుదర్శన్, వరుణ్ చక్రవర్తీ సీవోఈలోనే కోలుకుంటున్నారు.






