12-02-2026 12:09:15 AM
సిర్గాపూర్, ఫిబ్రవరి 11:సిర్గాపూర్ ఎస్టీ బాలికల గురుకుల పాఠశాలకు చెందిన 5 మంది విద్యార్థులు జిల్లా స్థాయి క్రీడలకు ఎంపికయ్యారని పీఈటీ సుమలత తెలిపారు. 200 మీటర్ రన్నింగ్ లో మొదటి స్థానం, లాంగ్ జంప్ లో అంజలి రెండో స్థా నం, 100 మీటర్ల పరుగులో బిందు రెండవ స్థానం సాధించారని చెప్పారు. అదేవిధంగా కబడ్డీలో మీరా, నందిని సత్తా చాటి జిల్లా స్థాయికి ఎంపిక కాగా సుమలత షార్ట్ పుట్, జావలిన్ త్రోలో మొదటి స్థానాన్ని సాధించారన్నారు.