15 March, 2026 | 8:15 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

మండలి ప్రతిపక్ష నేతగా సిరికొండ

14-10-2024 02:34 AM

అభినందించిన స్పీకర్ ప్రసాద్, మంత్రి శ్రీధర్‌బాబు 

హైదరాబాద్, అక్టోబర్ 13 (విజయక్రాంతి): శాసనమండలి ప్రతిపక్ష నేతగా  బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్,  మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్‌తో పాటు పలువురు ఎమ్మెల్సీలు మధుసూదనాచారికి శుభాంక్షలు తెలిపారు. కాగా ప్రభుత్వం తరపున శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కలిసి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం మధుసూదనచారి మాట్లాడుతూ తనకు అప్పగించిన బాధ్యతలను అంకితభావంతో నిర్వహిస్తానన్నారు. ప్రజా సమస్యలపై సభలో మాట్లాడి ప్రభుత్వం దృష్టితీసుకొచ్చిన అమలు చేసేలా తన వంతు పోరాటం చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.