15 March, 2026 | 9:35 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

క్రిశాంక్‌కు మెయిన్ హార్ట్ లీగల్ నోటీసులు

14-10-2024 02:32 AM

 హైదరాబాద్, అక్టోబర్ 13 (విజయక్రాంతి): మూసీ ప్రాజెక్టు కన్సల్టెన్సీ విషయంలో నిరాధార ఆరోపణలు చే శారంటూ   బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్‌కు మెయిన్‌హార్ట్ సంస్థ లీగల్ నోటీసులు జారీ చేసింది. ఉద్దేశ్యపూర్వకంగా తమ సంస్థ ఇమేజ్‌ను దెబ్బతినే లా ఆరోపణలు చేశారని పేర్కొంది.

క్రిశాంక్ తన వ్యాఖ్యలను 24 గంటల్లోపు ఉప సంహరించుకుని క్షమాప ణలు చెప్పాలని, ఎక్స్‌లో పెట్టిన పోస్టులను తొలగించాలని డిమాండ్ చేసిం ది. లేనిపక్షంలో న్యాయపరంగా ముం దకు వెళతామని ఆ సంస్థ హెచ్చరించింది. ఈ సందర్భంగా నోటీసులకు క్రిశాంక్ స్పందిస్తూ మూసీ కాంట్రాక్టుపై ఎక్స్ పోస్టులను తొలగించే ప్రసక్తి లేదని స్పష్టం చేవారు.

నోటీసులు విషయమై పార్టీ పెద్దలతో చర్చించినట్లు తెలిపారు. సింగపూర్ కంపెనీ ఇచ్చిన నోటీసులకు తమ పార్టీ లీగల్ సెల్ సమాధానం ఇస్తుందన్నారు. రూ. 3 వేల కోట్ల కుంభకోణంలో మెయిన్‌హార్ట్‌కు పాకిస్తాన్ రెడ్ వారెంట్ నోటీసు లు జారీ చేసిన సంగతి నిజం కాదా, ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా నిషేధించింది వాస్తవమా కాదా అని ప్రశ్నించారు.

సీఎం రేవంత్ రెడ్డి, మూ సీ కాంట్రాక్టర్ సింగపూర్ కంపెనీ నో టీసులకు, పోలీసు కేసులకు భయపడబోమని కుండబద్దలు కొట్టారు. రూ.3 వేల కోట్ల కుంభకోణంలో రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయిన మెయిన్ హార్ట్‌కు మూసీ మాస్టర్ ప్లాన్ తయారీ కాంట్రాక్టు ఏ విధంగా ఇస్తారని ఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆదివారం ఎక్స్ వేదికగా క్రిశాంక్ నిలదీశారు.