18 July, 2026 | 2:13 AM

తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు స్థల పరిశీలన

18-07-2026 02:13 AM

పెద్దమందడి, జూలై 17: వనపర్తి నియోజకవర్గం పెద్దమందడి మండలం వెల్టూరు జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సందర్శించి, తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్) ఏర్పాటుకు అవసరమైన సౌకర్యాలను పరిశీలించారు. పాఠశాల నిర్మాణానికి సంబంధించిన వ్యయ అంచనాలను త్వరగా సిద్ధం చేసి సమర్పించాలని ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. స్థలాన్ని ముందుగా సర్వే చేసి హద్దులు నిర్ణయించిన అనంతరం పనులు ప్రారంభించాలని స్థానికులు కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ యాదయ్య, ఈడబ్ల్యూఐడీసీ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.