7 July, 2026 | 6:31 PM

Breaking News

జూలై 10న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయండి   •   విద్యార్థుల భవిష్యత్ తో చెలగాటమాడుతున్న ప్రైవేట్ పాఠశాలలు   •   "సర్" ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలి   •   బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నాయకత్వానికి ఏడాది.. రామాలయంలో ప్రత్యేక పూజలు   •   ఆదివాసి నాయకపోడ్ కులస్తులకు దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు   •   ప్రభుత్వ ఉచిత విద్యను, సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలు చేరాలి   •   విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన పెద్దకాపర్తి సర్పంచ్   •   గౌలిగూడ కు వెళ్లాలా... అయితే ముక్కు మూయాల్సిందే...!   •   మృతుల కుటుంబాలకు పరామర్శ, ఆర్థిక సాయం   •   డబుల్ మర్డర్ కేసులో సంచలన తీర్పు   •  

విద్యుదాఘాతంతో ఆరు పశువులు మృతి

16-06-2025 10:26 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) సీరోలు మండలం తాళ్ల సంకీస శివారు పొలాల్లో తెగిపడ్డ విద్యుత్తు లైనుకు విద్యుత్ సరఫరా జరగడంతో విద్యుదాఘాతంతో ఐదు ఆవులు, ఒక ఎద్దు మృత్యువాత పడ్డాయి. మరో ఎద్దు తీవ్రంగా గాయ పడింది. పిక్లా తండాకు చెందిన రైతులకు చెందినవిగా గుర్తించారు. బాధిత రైతులు తమకు న్యాయం చేయాలని కురవి మహబూబాబాద్ రహదారిపై నిరసనకు దిగడంతో ట్రాఫిక్ స్తంభించింది. విషయం తెలుసుకున్న సీరోల్ ఎస్సై నగేష్ సంఘటన స్థలికి చేరుకొని ఆందోళనకారులకు ట్రాఫిక్ క్లియర్ చేశారు. విద్యుత్తు లైను తెగిపడ్డా విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల విద్యుత్ సరఫరా జరిగి పశువులు మరణించాయని, విద్యుత్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.