25 May, 2026 | 1:00 AM

వడదెబ్బతో ఆరుగురి మృతి

25-05-2026 12:23 AM

ఉమ్మడి వరంగల్ జిల్లోలో ఐదుగురు, ఖమ్మం జిల్లాలో ఒకరు

వరంగల్/మధిర, మే 24 (విజయక్రాం తి): రాష్ట్రంలో వడదెబ్బతో ఆదివారం ఆరుగురు మృతిచెందారు. ఉమ్మడి వరంగల్ జి ల్లాలో ఐదుగురు, ఖమ్మం జిల్లాలో ఒకరు మృతిచెందారు. వరంగల్ నగరంలోని ఉర్సు కు చెందిన రాజు, కరీమాబాదుకు చెందిన అశోక్, మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురుకు చెందిన రామయ్య, వీరమ్మ, కేసము ద్రం పట్టణానికి చెందిన లచ్చయ్య వడదెబ్బతో మృతిచెందారు.

కాగా ఇప్పటివరకు ఎండ తీవ్రతతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యా ప్తంగా 40 మంది వరకు మృత్యువాత ప డ్డట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. భూ పాలపల్లి జిల్లాలో కలెక్టర్ రాహుల్ శర్మ సోమవారం రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఖ మ్మం జిల్లా మధిర మండలం ఇల్లూరు గ్రామంలో కొరివి అచ్చయ్య వడదెబ్బ కారణంగా మృతి చెందారు. ఇటీవల పెరుగు తున్న ఎండలు, అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఆయన అస్వస్థతకు గురైనట్లు కు టుంబ సభ్యులు తెలిపారు.