ఆరు ఇసుక ట్రాక్టర్లు సీజ్
28-05-2024 12:05 AM
ఆదిలాబాద్, మే 27 (విజయక్రాంతి): పెన్‌గంగ నది నుంచి అక్రమంగా ఇసుక తరలించడంపై ఈ నెల 18న విజయక్రాంతి పత్రికలో ‘పెన్‌గంగలో ఇసుక దొంగలు’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనిపై అధికారులు స్పందించారు. అప్పటి నుంచి మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వారిపై నిఘా పెట్టారు. సోమవారం బేల మండలంలోని కాంగార్పూర్ గ్రామంలో మైనింగ్ శాఖ టీఏ రమేశ్ పవార్ తనిఖీలు నిర్వహించగా నది వద్ద ట్రాక్టర్లు కనిపించాయి. పట్టుబడిన ఆరు ట్రాక్టర్లను బేల పోలీస్ స్టేషన్‌కు తరలించారు.






