calender_icon.png 15 February, 2026 | 9:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ బస్సు బైక్ ఢీ: ఒకరి మృతి

15-02-2026 06:59:22 PM

అచ్చంపేట: ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతిచెందగా మరొకరు గాయపడ్డారు. అచ్చంపేట ఎస్సై సద్దాం తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్ కు చెందిన మహంకాళి మహేష్ (28) కొద్ది రోజులుగా నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో  నివాసం ఉంటున్నాడు.  ఆదివారం మధ్యాహ్నం పల్లవి తో కలిసి ద్విచక్ర వాహనంపై అచ్చంపేటకు వస్తున్నారు.

మహాశివరాత్రి సందర్భంగా అచ్చంపేట ఆర్టీసీ డిపో బస్సు క్షేత్రానికి వెళుతుంది. బస్సు చంద్ర సాగర్ సమీపంలో బైక్ ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహేష్ అక్కడికక్కడే మృతిచెందగా పల్లవి తీవ్రంగా గాయపడింది. ఆమెను చికిత్స కోసం అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటన స్థలికి ఎస్సై చేరుకొని వివరాలు సేకరించారు.యువతి స్వస్థలం అమ్రాబా ద్ మండలం వటువర్లపల్లి గ్రామం. రుతుని సోదరి ప్రభావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్ చేసినట్లు ఎస్ఐ చెప్పారు.